కరోనా వ్యాప్తితో నటుడు ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం

కరోనా వ్యాప్తితో నటుడు ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం

0

కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పెద్ద ఎత్తున జనాలు రోడ్లపైకి రాకూడదు అని ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి, అందుకే సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్నారు.. సినిమాలు బంద్ అయ్యాయి, మరో పక్క సినిమా పరిశ్రమలో షూటింగ్ లేక వారు కూడా ఇబ్బంది పడుతున్నారు.

తాజాగా కరోనా వైరస్ ఇబ్బందితో శ్రమకూలీలు ఇబ్బంది పడుతున్నారు వారికి సాయం చేయాలి అని చెప్పారు నటుడు ప్రకాష్ రాజ్, తాజాగా ఆయన చెప్పడమే కాదు సాయం కూడా చేశారు, తన పొలంలో పని చేస్తున్న వారితో పాటు ఇళ్లు, ప్రొడక్షన్ కంపెనీ, ఫౌండేషన్ ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకు జీతాలు ముందుగానే ఇచ్చేసినట్టు తెలిపారు.

అంతేకాదు ముందు వారి ఆరోగ్యం కాపాడుకోవాలి అని వారికి జాగ్రత్తలు చెప్పి వారిని ఇంటికి పంపించేశారు ప్రకాష్ రాజ్.. ఆగిపోయిన తన మూడు సినిమాల్లో పని చేస్తున్న రోజువారీ వర్కర్లకు కనీసం సగం జీతం ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించారు…. నిజంగా ప్రకాష్ రాజ్ చేసిన పని చాలా గొప్పది అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here