వుహ‌న్ లో కొత్త నిబంధ‌న ఇక ఆ ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే

వుహ‌న్ లో కొత్త నిబంధ‌న ఇక ఆ ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే

0
38

చైనాలోని ఈ వైర‌స్ పుట్టింది వుహ‌న్ న‌గ‌రంలో.. అక్క‌డ నుంచి చైనాలోని అతి పెద్ద న‌గ‌రాల‌పై అటాక్ చేసింది, అక్క‌డ నుంచి అన్నీ దేశాల‌కు పాకేసింది, అయితే రెండు నెల‌ల పాటు లాక్ డౌన్ నిర్భందం ప‌లు ఆంక్ష‌ల నుంచి వుహ‌న్ న‌గ‌రం కాస్త రిలీఫ్ పొందింది.

జ‌నం ఇప్పుడు రోడ్ల‌పైకి వస్తున్నారు. అన్నీ కార్యాల‌యాలు ఓపెన్ అయ్యాయి. అయితే గ‌త మూడు నెల‌లుగా ఇప్పటివరకు చైనాలో 82545 కరోనా కేసులు నమోదు కాగా 3314 మంది చనిపోయారు. చైనాలో కాస్త పాత ప‌రిస్దితి వ‌చ్చింది క‌రోనా కేసులు న‌మోదు అవ్వ‌డం లేదు.

నేడు తొలిసారిగా ప్రయాణికుల రైలు వచ్చింది . ఇక ఇక్క‌డ న‌గ‌రంలోకి వ‌చ్చేవారు ఎవ‌రైనా స‌రే వారి ద‌గ్గ‌ర ఉన్న మొబైల్ యాప్ ద్వారా ఆరోగ్యక‌ర‌మైన గ్రీన్ కార్డు చూపించాలి.. అది ఉంటేనే ఈ ప్రాంతంలోకి ఎంట‌ర్ అవుతారు…చైనాలో ఏప్రిల్ 8 వరకు ఆంక్షలు ఉంటాయి .విదేశాలనుండి వచ్చేవారికి క్వారంటైన్ పరీక్షలు వుంటాయని చైనా ప్రభుత్వం చెప్పింది.