ఆనాటి మరువని రోజుని గుర్తు చేసుకున్న విజయసాయిరెడ్డి

ఆనాటి మరువని రోజుని గుర్తు చేసుకున్న విజయసాయిరెడ్డి

0

నేటికి వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది, దాదాపు 9 సంవత్సరాల పోరాటం తర్వాత గత ఏడాది సరిగ్గా ఇదే రోజు వైసీపీ అధినేత సీఎం జగన్ సీఎం అయ్యారు, గడిచిన ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఇది, అయితే ఈ మరిచిపోలేని రోజుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ పలు ట్వీట్లు చేశారు.

తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపడం. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదలల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత’అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ భావోద్వేగ ట్వీట్ చేశారు.

అంతేకాదు మరో ట్వీట్ లో….ఏడాది క్రితం ఇదే రోజు, ఫ్యాన్ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది. ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు. తన వెంట నడిచిన ప్రజల కోసం పది తలల విషనాగుతో పోరాడారాయన. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారుఅంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here