ఇంతకీ రానా మిహికకి ఏమిచ్చి ప్రపోజ్ చేశాడంటే

ఇంతకీ రానా మిహికకి ఏమిచ్చి ప్రపోజ్ చేశాడంటే

0

దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటివాడు కాబోతున్నాడు, తనస్నేహితురాలు కాబోయే భార్య మిహీకను ఇటీవలే సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసి సడెన్ షాకిచ్చాడు. ఇక వీరి వివాహానికి ఈ ఏడాది ముహూర్తం పెట్టనున్నారు, ఇప్పటికే రానా- మిహీక రోకా వేడుక ఫోటోలు వైరల్ అవుతున్నాయి, త్వరలో వీరి నిశ్చితార్దం జరుగనుంది.

తన లవ్ గురించి లాక్డ్ అప్ విత్ లక్ష్మి (ఇన్ స్టా) షోలో లక్ష్మి మంచు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రానా. ఇక తన చెల్లి అశ్రితకు మిహికా క్లాస్ మేట్, దీంతో వారి నుంచి తనకు ఫ్రెండ్ అయింది అని చెప్పాడు రానా.చాలా కాలం స్నేహం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని లవ్ లో పడ్డారట.

ఇక రానా కూడా చాలా డిఫరెంట్ గా ప్రపోజ్ చేశాడు, పువ్వు గులాబీ ఖరీదైన గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు, నేరుగా
మిహీక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను కలిశాడట. ఉన్న విషయం కాస్తా చెప్పేశాడట, దీంతో తర్వాత ఇరుకుటుంబాలు ఒకే చెప్పాయి, అది రానా లవ్ స్టోరీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here