బిగ్ బ్రేకింగ్ – ఏపీ వాహనదారులకు మరో శుభవార్త

బిగ్ బ్రేకింగ్ - ఏపీ వాహనదారులకు మరో శుభవార్త

0
36

లాక్ డౌన్ వేళ ఏ కార్యాలయాలు తెరచుకోలేదు…ఇక అత్యవసర సర్వీసులు మాత్రమే తెరచి ఉన్నాయి, పోలీసులు వైద్య సిబ్బంది పనిచేశారు పూర్తిగా, అయితే రవాణాశాఖ కార్యాలయాలు మాత్రం తెరచుకోలేదు, ఈ సమయంలో ఇప్పుడిప్పుడే సడలింపుల్లో భాగంగా రవాణాశాఖ కార్యాలయాలు తెరచుకుంటున్నాయి, ఈ సమయంలో కీలక ప్రకటన అయితే చేశారు.

లాక్డౌన్ దెబ్బకు నిలిపివేసిన లెర్నింగ్ లైసెన్సు, కొత్త డ్రైవింగ్ లైసెన్సుల సర్వీసులను పున:ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి ఈ సర్వీసులను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఇక రెండు నెలలుగా లైసెన్సుల కోసం చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్సుల స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెబుతున్నారు, ఇక లాక్ డౌన్ కు ముందు చాలా మంది అప్లై చేసుకున్నారు అని వారు డ్రైవింగ్ పరీక్షలకు హజరుకాలేదని వారు మళ్లీ తేదీలు మార్చుకుని పరీక్షలకు హజరు కావాలి అని చెబుతున్నారు, ఇలా పరీక్షలకు వచ్చేవారు కచ్చితంగా మాస్క్ ధరించాలి అని తెలిపారు…డ్రైవింగ్ లైసెన్సుల పరీక్షల నిమిత్తం ఒకరిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఇస్తాన్నామని అన్నారు.