రూ.48 కోట్లతో కొత్త ఆఫీస్ పెట్టిన టాప్ హీరోయిన్

రూ.48 కోట్లతో కొత్త ఆఫీస్ పెట్టిన టాప్ హీరోయిన్

0

హీరోలకే కాదు హీరోయిన్లకు భారీగా రెమ్యునరేషన్ ఉంటుంది అనేది తెలిసిందే, ముఖ్యంగా బాలీవుడ్ లో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు ఉన్నారు, బీ టౌన్ లో రెమ్యునరేషన్ మన చిత్ర సీమలో అన్నింటి కంటే ఎక్కువ అంటారు.. ఇక్కడ కోట్లల్లో రెమ్యునరేషన్ ఉంటుంది.

తాజాగా బాలీవుడ్ నటి కంగన రనౌత్ అంటేనే ఒక ట్రెండ్ సెట్టర్. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే బాలీవుడ్ లో మహిళగా తనదైన ముద్రను వేసింది ఆమె . సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది, అయితే ఆమె నిర్మాతగా, దర్శకురాలిగా కూడా మారింది. తాజాగా ముంబైలో రూ. 48 కోట్లు ఖర్చుపెట్టి ఓ ఖరీదైన ఆఫీసును ప్రారంభించింది.

ఈ విషయం తెలిసి బీ టౌన్ లో పెద్ద దర్శక నిర్మాతలు షాక్ అయ్యారు, కేవలం 1500 తో ఇంటి నుంచి బయటకు వచ్చా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను అని చెబుతోంది కంగనా.. ఆరోజు డబ్బు సంపాదించాలి అనే కోరికతో మా ఊరు నుంచి ముంబై వచ్చానని తెలిపింది. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి అత్యంత ధనికురాలిగా నిలవడమే తన లక్ష్యమని చెప్పింది. మొత్తానికి ఇంకా మీరు మరింత సక్సెస్ అవ్వాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.