మహేష్ పరశురామ్ చిత్రం స్టోరీ ఇదేనా నిజమెంత

మహేష్ పరశురామ్ చిత్రం స్టోరీ ఇదేనా నిజమెంత

0

ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా ఏ చిత్రం చేయబోతున్నారు అనేది ఇప్పుడు అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు, దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నారు, సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో నెక్ట్స్ మూవీ చేయాలనుకున్నారు ప్రిన్స్ . కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ను హోల్డ్లో పెట్టి పరశురామ్తో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఒకేచేశారు.

ఇక ఈ సినిమాకి సంబంధించి వర్క్ అయితే డైరెక్టర్ పరశురామ్ చేస్తున్నారు, ఇక ఈ చిత్రానికి సంబంధించి . ప్రిన్స్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు అంతా రెడీ అవుతున్నారు అని తెలుస్తోంది, కుదిరితే ఆరోజు టైటిల్ కూడా చెబుతారు అని వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా టైటిల్ సర్కార్ వారి పాట అంటూ సోషల్ మీడియాలో లీక్ అయింది, కాని చిత్ర యూనిట్ ఎవరూ కూడా స్పందించలేదు, అసలు దీని గురించి వార్తలు వస్తున్నాయి కాని ఎక్కడా రివీల్ కాలేదు.. ఈ సమయంలో మరో వార్త వైరల్ అవుతోంది.. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. బ్యాంకింగ్ వ్యవస్థలోని జరుగుతున్న మోసాలకు సంబంధించిన స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుంది అని తెలుస్తోంది, సో ..మరి వీటిపై క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది, ఇటు అభిమానులు అయితే ఈ ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు.