బ్రేకింగ్ – చిలుకూరు బాలాజీ దేవాలయం ఎప్పుడు తెరుస్తారంటే

బ్రేకింగ్ - చిలుకూరు బాలాజీ దేవాలయం ఎప్పుడు తెరుస్తారంటే

0

తెలంగాణ వెంకన్నగా ఆయనని పిలుస్తారు, ఆయన దగ్గరకు వెళితే ఎలాంటి కోరికలు అయినా తీరతాయి అని భక్తులు నమ్ముతారు..కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఇక్కడ చిలుకూరు బాలాజీ ఆలయంలో కూడా భక్తులకి దర్శనం నిలిపివేశారు.

భక్తులకి అనుమతి లేదు.. స్వామికి నిత్య కైంకర్యాలు పూజలు అక్కడ పండితులు చేస్తున్నారు, కాని భక్తులకి ప్రవేశం లేదు, అయితే మార్చి25 తర్వాత ఈ ఆలయంలో భక్తులకు దర్శనం కరువైంది. ఇక జూన్ 8 నుంచి దేశంలో దేవాలయాలు తెరచుకోనున్నాయి.

మరి ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయం తెరచుకుంటుందా అంటే ..చిలుకూరు బాలాజీ టెంపుల్ని మాత్రం జూన్ 8న తెరవడం లేదని అలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. గుడిని ఎప్పుడు తెరుస్తామో సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక భక్తులు స్వామి దర్శనం కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here