తండ్రి కాబోతున్న ఇండియా స్టార్ క్రికెటర్…

తండ్రి కాబోతున్న ఇండియా స్టార్ క్రికెటర్...

0
40

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి కాబోతున్నాడు తన కాబోయే భార్య నటాసా స్టాన్ కోవిచ్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని ఇన్ స్టాగ్రామ్ లో పాండ్యా ప్రకటించాడు జనవరి 1న దుబాయ్ లో సెర్బియా నటి మోడల్ అయిన నటాసా పాండ్యా నిర్చితార్థం జరిగింది… అయితే ఇటీవలే విడుదల చేసిన మరో ఫోటోలో పాండ్యా నటాషా పూలదండలతో కనిపిస్తున్నారు..

అయితే ఇది పెళ్లికి సంబంధించిన ఫోటోనా కాదా అనే విషయంపై స్పష్టత లేదు… మా జీవితంలో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది మీ అందరి ఆశీర్వాదం దీవేనలు కావాలి నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది…

మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది… అని నటాషాతో కలిసి దిగిన ఫోటోలను పాండ్యా పోస్ట్ చేశాడు.. కాగా గుజరాత్ కు చెందిన 26 ఏళ్ల హార్దిక్ పాండ్యా 2016 భారత్ తరపున అరంగేట్రం చేశాడు.. ఇప్పటివకు అతను 11 టెస్టులు 54 వన్డేలు 40 టీ 20మ్యాచ్ లు ఆడారు…