పెళ్లిపేరు ఓ మాయలాడి ఘరానా మోసం…

పెళ్లిపేరు ఓ మాయలాడి ఘరానా మోసం...

0

పెళ్లిపేరు చెప్పి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగిని మోసం చేసింది ఒక మహిళ… ఈ సంఘట హైదరాబాద్ కేజీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… నగరంలో వసంతనగర్ కు చెందిన ఉప్పలపాటి చైతన్య అనే వ్యక్తి విహారీ సాఫ్ట్ వేర్ ఇంజినేర్…

పెళ్లి సంబంధాలకోసం వెతుకుతున్న ఆయనకు ఒక పెళ్లి సంబంధం సైట్ లో మాగంటి అనుపల్లవి పేరుతో ఒక మహిళ పరిచయం అయింది.. తనది జూబ్లి హిల్స్ అని తాను డాక్టర్ అని నమ్మించింది… అలా నెమ్మదిగా ఆ వ్యక్తితో పరిచయం పెంచుకుంది…

ఆ తర్వాత తనకు కోట్లాది రూపాయలు రావాల్సి ఉందని కానీ వాటికోసం కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని నమ్మబలికింది… ఇక ఆమె ఉచ్చుటోపిలో పడిన ఆ వ్యక్తి 1.02 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశాడు ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసి పత్తాలేకుండా పోంది… దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు…