టీ తాగితే మంచిదా చెడా నిపుణుల మాట

టీ తాగితే మంచిదా చెడా నిపుణుల మాట

0

ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగాలి అని అంటారు కొందరు, అసలు కాఫీ పడకపోతే మనకు బండి నడవదు అంటారు చాలా మంది, ఇక టీ తాగకపోతే వెలితిగా ఉంది అంటారు.. కోట్ల రూపాయల ప్రాజెక్టులు కంపెనీలు ఏవి అయినా ఈ టీ భేటీతో క్లోజ్ అవుతాయి, అంత వాల్యు ఉంటుంది ఈ టీకి..

అయితే . టీ కేవలం ఓ రిఫ్రెష్మెంట్ మాత్రమే కాదు. అది హెల్త్ కి కూడా ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. వాస్తవానికి కాఫీ కంటే టీ లో యాభై శాతం తక్కువ కెఫీన్ ఉంటుంది. ఇక చాలా మంది క్లాస్ గా హెర్బల్ టీ తాగుతారు దాని వల్ల మంచిదే అందులో కెఫైన్ ఉండదు.

ఇక టీ తాగితే ఎముకలు బలంగా మారతాయి అంటున్నారు, అంతేకాదు కాల్షియం, ఐరన్ లోపాలు ఉండవు అని చెబుతున్నారు వైద్యులు.అందాన్ని కూడా మెరుగు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. టీ తాగితే వయసు తగ్గి.. శరీరం ముడతలు పడకుండా ఉండేలా చేస్తుంది, అలాగని రోజుకి పదిసార్లు కాదు రోజుకి రెండు సార్లు తాగడం మేలు.ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు దూరంగా ఉంటాయి. ఇక శరీరానికి ఒంటికి జాయింట్ పెయిన్స్ ఉంటే టీ తాగితే తగ్గుతాయి అంటున్నారు, అతిగా తాగద్దు రోజుకి ఒకటి లేదా రెండు సార్లు బెటర్.