తెలంగాణలో రైలు దిగగానే ప్రయాణికులకు కండిషన్స్ ఇవే

తెలంగాణలో రైలు దిగగానే ప్రయాణికులకు కండిషన్స్ ఇవే

0
50

జూన్ 1 నుంచి దేశ వ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది రైల్వేశాఖ.. అంతా ఆన్ లైన్ రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణానికి అవకాశం ఉంది, ఇక 90 నిమిషాల ముందు స్టేషన్ కు చేరుకోవాలి, దుప్పట్లు కూడా ప్రయాణికులు తెచ్చుకోవాలి ఇలా పలు కండిషన్స్ పెట్టింది, భౌతిక దూరం పాటిస్తూ ఇప్పటికే రైళ్లలో ప్రయాణాలు 1 వ తేది నుంచి చేస్తున్నారు.

ఇక తెలుగు స్టేట్స్ ఏపీ తెలంగాణ మీదుగా కొన్ని రైళ్లు నడుస్తున్నాయి, మరి రైలులో ప్రయాణించిన వారికి తెలంగాణలో దిగగానే ఎలాంటి పరీక్షలు చేస్తున్నారంటే, తెలంగాణలో ప్రయాణికులు రైలు దిగగానే ముందు ధర్మల్ స్క్రీనింగ్ చేస్తారు.

ప్రతీ రైల్వే స్టేషన్లో మెడికల్ టీమ్ ఉంటుంది. కరోనా వైరస్ లక్షణాలు లేనివారిని ఇళ్లకు పంపిస్తారు. ఆ ప్రయాణికులు 14 రోజులు హోమ్ క్వారెంటైన్లో ఉండాలి. వారి చేతికి వెంటనే స్టాంప్ వేస్తారు, వారు మళ్లీ ఎక్కడకు ప్రయాణం చేయకూడదు, ఇంటిలో ఉండాలి, ఇక ఒకవేళ ఎవరైనా వైరస్ లక్షణాలతో ప్రయాణం చేస్తే వారిని ప్రభుత్వ క్వారంటైన్ కి పంపిస్తారు, ఈ రూల్స్ ఒప్పుకుంటేనే రైలు ప్రయాణం చేయాలి.14 రోజుల క్వారంటైన్ తర్వాత వారికి టెస్ట్ చేసి నెగిటీవ్ వస్తే ఇంటికి పంపుతారు.