బిత్తిరి స‌త్తికి బిగ్ ఆఫ‌ర్

బిత్తిరి స‌త్తికి బిగ్ ఆఫ‌ర్

0

తాజాగా బిగ్ బాస్ 4 గురించి చ‌ర్చ జ‌రుగుతోంది, ఇంత‌కీ బిగ్ బాస్ తెలుగులో వ‌స్తుందా రాదా అనే అనుమానం కూడా చాలా మందికి ఉండేది.. చివ‌ర‌కు తెలుగులో బిగ్ బాస్ వ‌స్తోంద‌ట‌, మ‌రి అస‌లే లాక్ డౌన్ ఈ స‌మ‌యంలో బిగ్ బాస్ వ‌స్తే క‌చ్చితంగా టీఆర్పీ కూడా బీభ‌త్సంగా పెరుగుతుంది.

మ‌రి ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్స్ ఎవ‌రు అనేదానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.
వర్షిణి, తరుణ్, అఖిల్ సర్తాక్ లు ఈ షోలో పాల్గొనబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా తీన్మార్, ఇస్మార్ట్ న్యూస్ వంటి టీవీ షోలతో పాపులారిటీని సొంతం చేసుకున్న బిత్తిరి సత్తి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు అని తెలుస్తోంది.

కొన్ని రోజులు న్యూస్ ఛాన‌ల్ కు దూరంగా ఉండి బిగ్ బాస్ హౌస్ లో ఉంటార‌ట‌, ఇక స‌త్తి బిగ్ బాస్ కి వ‌స్తార‌ని అందుకే ప్ర‌స్తుతం ఆయ‌న ఈ విష‌యం ఇంకా చెప్ప‌డం లేదు అంటున్నారు అభిమానులు, త్వ‌ర‌లో ఇది స్టార్ట్ అవ్వనుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here