నిజమే ఆ దర్శకుడి కొడుకుతోనే అనుష్క పెళ్లి

నిజమే ఆ దర్శకుడి కొడుకుతోనే అనుష్క పెళ్లి

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లి గురించి ఏ స్థాయిలో ప్రచారం జరుగుతుందో అందరికి తెలిసిందే… గత ఆరు సంవత్సరాలుగా మీడియాలో అనుష్క పెళ్లి గురించి వార్తలు వస్తునే ఉన్నాయి… హీరో ప్రభాస్ తో ఈమె ప్రేమలో ఉన్నట్లు ఎక్కువగా వార్తలు వచ్చాయి కానీ తమది స్నేహం మాత్రమే అంటూ పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు…

ఆ తర్వాత కూడా అనుష్క ప్రేమ పెళ్లి గురించి మీడియాలో ప్రచారం జరిగింది… ఆ మధ్య ఒక క్రికెటర్ తో అనుష్క పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి… ఆతర్వాత ఒక దర్శకుడి కొడుకుతో అనుష్క పెళ్లికి రెడీ అయిందని ప్రచారం సాగింది… అయితే దర్శకుడి కుమారుడికి అప్పటికే వివాహం అయి విడాకులు కూడా అయ్యాయి… దాంతో అంతా అవాక్కయ్యారు…

ఆ వార్తలో నిజం లేదని చాలామంది అన్నారు… అనుష్కు అంత అవసరం ఏంటని ఈ వార్త చాలామంది నమ్మలేదు…కానీ మళ్లీ ఈ వార్తలే ప్రముఖంగా వస్తున్నాయి.,. ఆదర్శకుడి కొడుకును అనుష్క వివాహం చేసుకోబోతున్న విషయం నిజమే అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం అనుష్క చేస్తున్న సినిమా పూర్తి అవ్వగాని దర్శకుడి కుమారుడితో వివాహానికి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి…