హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తే ప్రతీ ఒక్కరు ఈ నిబంధనలు తప్పక పాటించాల్సిందే…

హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తే ప్రతీ ఒక్కరు ఈ నిబంధనలు తప్పక పాటించాల్సిందే...

0
36

తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా అనునిత్యం సరారి కరోనా కేసులు నమోదు అవుతుండటం అందులోను ఎక్కువగా సింహభాగం గ్రేటర్ హైదరాబాద్ లోనే రిజిష్టార్ కావడంతో మళ్లీ లాక్ డౌన్ దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది… జూలై 2న కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి 3వ తేదీ నుంచి జీహెచ్ ఎంసీలో కఠినమైన లాక్ డౌన్ విధించడం షురూ అయినట్లు సమాచారం…

రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఈ సారి లాక్ డౌన్ ను గ్రేటర్ హైదరాబాద్ పరిధికే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది… జీహెచ్ ఎంసీ లో కరోనా బీభత్స నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లాక్ డౌన్ సిఫారస్ చేస్తూ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు తెలిసిందే…

ఈ నేపథ్యంలో గతంలో విధించిన లాక్ డౌన్ మాదిరిగా కాకుండా కఠినమైన నిబంధనలతో తొలుత 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది… నిత్యావసరాల కోసం కేవలం 2 గంటల వ్యవధి మాత్రమే ఇవ్వవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి…