మరో బిగ్ షాక్ ఇచ్చిన అమెరికా…

మరో బిగ్ షాక్ ఇచ్చిన అమెరికా...

0
43

విదేశి విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికా షాక్ ఇచ్చింది… ఆన్ లైన్ లో విద్యను అభ్యసించే విద్యార్థులకు స్వదేశాలకు పంపించాలని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కష్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నిర్ణయించింది… కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు… దీంతో అమెరికాలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులలో టెన్షన్ నెలకొంది…

ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులపై ఈ ప్రభావం చూపనుంది… అయితే వారిలో రెండు లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు… గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుమేషన్ విద్యార్థుల కోసం ఎఫ్ వన్ యంవన్ కేటగిరి విసాలను జారీ చేస్తోంది ఆమెరికా…

అయితే ఇప్పుడు ఈ వీసాలను ఉపసంహరించుకుంది… ఈ విసాకలిగిన విద్యార్థులు ప్రస్తుతానికి అమెరికాలో నివసించలేరని తమ స్వదేశాలకు వెళ్లిపోవాలని లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు మిగ్రేషన్ అండ్ కష్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు..