ధర్మరాజు గురించి మీకు తెలియని 10 నమ్మలేని విషయాలు

ధర్మరాజు గురించి మీకు తెలియని 10 నమ్మలేని విషయాలు

0
363

ధర్మరాజు అంటే తెలియని వారు ఉండరు, పాండవుల్లో ప్రధముడు, పాండు రాజు సంతానమైన వారిలో ధర్మరాజే మొదటి వ్యక్తి, కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు..పాండురాజు మరణం తర్వాత పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారు.

ఇక అన్నీ విద్యలు నేర్చుకున్న వ్యక్తిగా ధర్మరాజు ఉండేవాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజు పదవిలో నియమించాడు.శ్రీకృష్ణుని కోరిక మేరకు ఇంద్రుడు పంపిన విశ్వకర్మ ఇంద్రప్రస్థం అనే నూతన రాజధానిని ధర్మరాజుకు నిర్మించి యిచ్చాడు. ఇక సగ భాగం పాలన ధర్మరాజు చేసేవాడు.

తన తండ్రి పాండురాజును స్వర్గానికి పంపే ఉద్దేశంతో ధర్మరాజు రాజసూయ యాగం దిగ్విజయంగా నిర్వహించాడు. యాగ సభలో శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇఛ్ఛి పూజించాడు. శకుని చేతిలో ధర్మరాజు తన సర్వస్వాన్నీ, సోదరులనూ, చివరికు ద్రౌపదినీ ఒడ్డి ఓడిపోతాడు..శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయమైన వస్త్రాలను అనుగ్రహిస్తాడు దీంతో గండం నుంచి గట్టెక్కుతారు.

రెండోసారి కూడా జూదమాడి మళ్లీ శకుని చేతిలో ఓడిపోతాడు,నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చెయ్యాలి అనేపందెం కడతారు.ధర్మరాజు శకుని చేతిలో మళ్ళీ ఓడిపోయాడు, ఇక ధర్మరాజు వెంట చాలా మంది ఆ ప్రజలు అరణ్యానికి వెళ్లారు.. ఈ సమయంలో పెద్దల మాట విని ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించాడు, దీంతో ఆయనకు అక్షయపాత్రను వరంగా ఇచ్చాడు సూర్యుడు, దాని ప్రభావం వల్ల అతడు వెంటవచ్చిన యావన్మందినీ పోషిస్తూ, అరణ్యంలో కూడా మహారాజులాగా బతికాడు.