నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్… ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ సెక్సీ హీరోయిన్…

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్... ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ సెక్సీ హీరోయిన్...

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.. ఈచిత్రం తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే…

తాజాగా మరో చిత్రం వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతుంది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ గతంలో ఎన్నడు లేని విధంగా కొత్త లుక్ లో కనిపించనున్నారని టాక్… ఈ చిత్రానికి సంబంధించి అయినను పోయిరావాలే హస్తినకు అనే టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేసినట్లు టాక్… ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారని టాక్….

ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి… ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసనగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని వార్తలు వస్తున్నాయి.. పూజా హెగ్దె రష్మిక సమంతా ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తారని మరో హీరోయిన్ జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది.. దాదాపు జాన్వీ పేరు ఫిక్స్ అయినట్లు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here