బిగ్ బాస్ 4 నాగార్జున ప్రోమో టీమ్ ఈ ముగ్గురేనా ?

బిగ్ బాస్ 4 నాగార్జున ప్రోమో టీమ్ ఈ ముగ్గురేనా ?

0

తెలుగులో ఇప్పుడు ఈ ఆగ‌స్ట్ నుంచి బిగ్ బాస్ 4 స్టార్ట్ కానుంది అని తెలుస్తోంది, అయితే దీనికి సంబంధించి హోస్ట్ నాగార్జున అని తెలుస్తోంది, ఇక షూటింగ్ కూడా చాలా వ‌ర‌కూ ప్రోమో రెడీ అయింది అని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక బిగ్ బాస్ 4 కి నాగ్ హోస్ట్ గా వుంటార‌ని వార్త‌లు ముందు వ‌చ్చాయి అదే ఫిక్స్ అయింది, ఇక ఇప్ప‌టికే స్టార్ మా ఓ వీడియో వ‌ద‌ల‌డంతో ఇక ఈ ఏడాది ఈ రియాలిటీ షో ఉంది అని తేలింది, అయితే తాజాగా ఇప్పుడు ప్రోమో సిద్దం అవుతోంది.

హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఈ ప్రోమోను చిత్రీకరిస్తున్నారు. దీనికి సోగ్గాడే చిన్ని నాయన సినిమా దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారట‌.. అలాగే బాహుబలి కెమెరామెన్ కెకె సెంథిల్ కుమార్ చిత్రీకరించారు అని తెలుస్తోంది. ఈ ప్రోమో చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ట‌, కోవిడ్ కు సంబంధించి జాగ్ర‌త్త‌లు కూడా చెప్పి ఉండ‌వ‌చ్చు అంటున్నారు, సో ఈ వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు బుల్లితెర అన‌లిస్టులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here