వంగపండు ప్రసాదరావు క‌న్నుమూత ( రియ‌ల్ స్టోరీ)

వంగపండు ప్రసాదరావు క‌న్నుమూత ( రియ‌ల్ స్టోరీ)

0
28

ఏం పిల్ల‌డో ఎల్ద‌మొస్త‌వా ఈ పాట పాడినా విన్నా మ‌న‌కు గుర్తు వ‌చ్చే పేరు ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు, ఉత్త‌రాంధ్రా వెనుక‌బాటు త‌నం పై నిత్యం గ‌ళం ఎత్తి త‌న పాట‌ల‌తో గేయాల‌తో అంద‌రికి తెలిసేలా చేసిన మ‌హోన్న‌త వ్య‌క్తి, అయితే ఆయ‌న మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు.

ఆయ‌న వ‌య‌సు 77 సంవ‌త్స‌రాలు ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఉత్త‌రాంధ్రా ముద్దుబిడ్డ‌గా అక్క‌డ వారు పిలుస్తారు.. విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు . తన జీవిత కాలంలో వందల పాటలకు ఆయన గజ్జెకట్టారు. 1972లో జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో బడుగుబలహీన వర్గాలను, గిరిజనులను చైతన్య పరిచారు.

అర్థరాత్రి స్వతంత్య్రం సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం మొదలైంది. 2017లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేత కళారత్న పురస్కారం అందుకున్నారు..ఉత్తరాంధ్ర జానపదానికి వన్నెతెచ్చిన‌ మహానుభావుడు వంగపండు ఇక లేరు అనే మాట తెలిసి అంద‌రూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.