అయోధ్య రాముడి ఆలయానికి భ‌క్తుడు భారీ కానుక‌

అయోధ్య రాముడి ఆలయానికి భ‌క్తుడు భారీ కానుక‌

0

అయోధ్య రాముడి ఆల‌యానికి భూమి పూజ అయింది, ఇక ఆల‌యం శ‌ర‌వేగంగా నిర్మించ‌డానికి ప‌నులు స్టార్ట్ చేశారు, అయితే ఆల‌య నిర్మాణానికి విరాళాలు కూడా భారీగానే ఇస్తున్నారు, ఈ స‌మ‌యంలో
ఇటుకలు, నిర్మాణ సామాగ్రి అయోధ్యకు తరలి వెళుతున్నాయి. వ్యాపారులు ఉద్యోగులు ఇలా ఎవ‌రికి తోచింది వారు సాయం చేస్తున్నారు.

హిందువులే కాదు.. ముస్లింలు సైతం మందిర నిర్మాణంలో ఏదో రకంగా పాలుపంచుకొని భారతదేశ గొప్పతనాన్ని చాటుతున్నారు. తాజాగా అయోధ్య రాముడి కోసం 2.1 టన్నుల బరువున్న గంటను తయారు చేయిస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్.

ఇది భారీ గంట‌గా మ‌న దేశంలో రికార్డు న‌మోదు చేయ‌నుంది.. ఉత్తర్‌ప్రదేశ్ జలేసర్‌లో దావూ దయాల్ అనే కుటుంబానికి ఇది త‌యారు చేయాలి అని బాధ్య‌త‌ల‌ను అప్పగించింది. అయితే ఈ గంట తయారీ కోసం వారి ద‌గ్గ‌ర పనిచేసే ఓ ముస్లిం వ్యక్తి కీలకంగా మారడం విశేషంగా మారింది. గుడి నిర్మాణానికి ముందే ఈ గంట త‌యారు చేసి ఇవ్వ‌నున్నారు.