డైరెక్టర్స్ బాలా ,వెట్రిమారన్ అన్ని సినిమాలకి అవార్డులెందుకోచ్చాయో తెలుసా

డైరెక్టర్స్ బాలా ,వెట్రిమారన్ అన్ని సినిమాలకి అవార్డులెందుకోచ్చాయో తెలుసా

0
35

మనలో చాల మందికి రెగ్యులర్ ,కమర్షియల్ సినిమాలు , లవ్ స్టోరీస్ ఎక్కువగా నచ్చుతాయి . ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో ఈ జోనర్ సినిమాలు చూసే వాళ్ళు ఎక్కువ … అయితే మనలో చాల మంది మన జీవితానికి ,వాస్తవికతకు అద్దం పెట్టె చాల సినిమాలు మిస్సై పోతుంటారు.

తమిళ్ డైరెక్టర్ బాల సినిమాలన్నీ రియాలిటీ కి దగ్గరగా ఉంటాయి ..నేనుదేవుణ్ణి , శివపుత్రుడు ,పరదేశి లాంటి మూవీస్ మనల్ని చాల ఆలోచింపజేస్తాయి . ఒక సామజిక సమస్యను నేపథ్యంగా తీసుకొని చేసే ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి గానీ రావు . అలాగే వెట్రి మారన్ తీసిన ఆడుకలం తెలుగులో పందెం కోళ్లు పేరుతో రిలీజ్ అయింది ఈ మూవీ ధనుష్ హీరోగా చేసిన ఈ మూవీ ఇక్కడ ప్లాప్ అయింది ..కానీ నేషనల్ అవార్డుని గెలిచింది .. ఇక విచారణ మూవీ కూడా మరో నేషనల్ అవార్డు గెలుచుకుంది .. నేను ఇప్పటిదాకా చెప్పిన సినిమాలు చూడక పోతే వెంటనే చూసెయ్యండి ..

ఇలాంటి దర్శకులు హిట్ కోసం ఆలోచించరు సమాజంలో జరిగే ఓ తప్పును ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు . తెలుగు లో డైరెక్టర్ క్రిష్ ఇలాంటి ప్రయత్నాల్లో ముందుంటారు .. అయన చేసిన వేదం , గమ్యం సినిమాలు ఓ గొప్ప అనుభూతిని ఇస్తాయి .. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలన్న సంకల్పమే వీరిని టాప్ డైరెక్టర్లుగా నిలబెట్టింది ..