భారీగా పెరిగిన బంగారం- వెండి ధ‌ర ఆల్ టైం రికార్డ్

భారీగా పెరిగిన బంగారం- వెండి ధ‌ర ఆల్ టైం రికార్డ్

0
182

బంగారం ధ‌ర‌కు రెక్క‌లు వ‌చ్చాయి..గ‌డిచిన వారం రోజులుగా డైలీ త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర మళ్లీ ప‌రుగులు పెట్టింది, ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో గోల్డ్ ధ‌ర త‌గ్గుతున్నా ఇక్క‌డ మాత్రం బంగారం ధ‌ర ఇండియాలో పెరుగుతోంది. మ‌రి నేడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.54,040కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.410 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,540కు చేరింది.

పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.240 పెరిగింది. దీంతో ధర రూ.66,600కు చేరింది. వ‌చ్చే రోజుల్లో బంగారం వెండి ధ‌ర‌లు మ‌రింత పెర‌గుతాయి అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు, గ‌డిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొన‌సాగింది, అందుకే బంగారం త‌గ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల ప‌త‌నంతో బంగారం ధ‌ర పెరుగుతోంది.