హైదరాబాద్ లో ఇల్లు కట్టుకునే వారికి కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్ లో ఇల్లు కట్టుకునే వారికి కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

0
40

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాలని తీసుకువచ్చారు, అయితే చాలా మంది హైదరాబాద్ లో ఉండేవారు సొంత ఇళ్లు కట్టుకోవాలి అని భావిస్తారు, అలాంటి వారికి తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
75 చదరపు గజాల వరకూ స్థలంలో ఇంటి నిర్మాణానికి ఇక అనుమతి అవసరం లేదు. 76 నుంచి 600 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణ ఆమోదం లభించనుంది.

అంటే మీరు 75 గజాల లోపు ఇల్లు కట్టుకుంటే ఎలాంటి పర్మిషన్ అక్కర్లేదు, దీనిపై టీఎస్ బీ పాస్ బిల్లు కూడా ఆమోదించారు.. 75 చ.గల వరకు ఉన్న స్థలంలో ఏడు మీటర్ల ఎత్తు వరకు జీ ప్లస్ ఒక అంతస్తు, స్టిల్ట్ ప్లస్ రెండంతస్తులు భవనం కట్టుకోవచ్చు.

76 నుంచి 600 చ.గల వరకు ఉన్న ప్లాట్లో 10 మీటర్ల గ్రౌండ్ ప్లస్ రెండు లేదా స్టిల్ట్ ప్లస్ మూడంతస్తులు ఎత్తు భవనానికి తక్షణ ఆమోదం లభిస్తుంది. 75 గజాల నిర్మాణంలో ఇంటికి మీరు టోకెన్ ఫీజు రూపాయి చెల్లించాలి,ఇవన్నీ ఆన్ లైన్ లో భవన నిర్మాణం డీటెయిల్స నమోదు చేయాలి, 100
ఆస్తిపన్ను చెల్లించాలి. ఇక ప్రభుత్వ భూముల్లో నిషేదిత ప్రదేశాల్లో ఆ ఇళ్లు కట్టకూడదు, వారి సొంత స్ధలం అయి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘించి నిర్మాణం చేసినట్లు గుర్తిస్తే
భవనం కూల్చివేత మూసివేత ఫెనాల్టీ ఉంటుంది.