S.B.I కస్టమర్లకు హెచ్చరిక.. సెప్టెంబర్ 18 నుంచి కొత్త రూల్

S.B.I కస్టమర్లకు హెచ్చరిక.. సెప్టెంబర్ 18 నుంచి కొత్త రూల్

0
27

మ‌న దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎప్పుడూ ఖాతాదారుల కోసం స‌రికొత్త స్కీములు తీసుకువ‌స్తుంది, అయితే ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవ‌లు కూడా బాగా విస్త‌రిస్తోంది ఈ బ్యాంక్, తాజాగా SBI తన కస్టమర్లకు తీపికబురు అందించింది.

ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌‌లో మార్పులు చేసింది. ఎవ‌రైనా ఎస్ బీ ఐ నుంచి రూ.10,000 లేదా ఆపైన మొత్తాన్ని ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవాలంటే కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ కు వ‌చ్చే ఓటీపీ ఎటీఎం ప్యాన‌ల్ పై ఎంట‌ర్ చేయాలి.

ఈ సదుపాయం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఎస్‌బీఐ ఓటీపీ ఆధారిత ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను రోజంతా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇక మీరు 10 వేల‌కు మించి విత్ డ్రా తీసుకుంటే క‌చ్చితంగా మొబైల్ తీసుకుని వెళ్లాలి ఇప్పుడు రోజంతా ఇది అమ‌లు చేస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఏటీఎం మోసాలు తగ్గుతాయని బ్యాంక్ న‌మ్ముతోంది.అయితే ఇది కేవ‌లం ఎస్ బీ ఐ బ్యాంకు ఏటీఎంల‌కి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది, మిగిలిన వాటికి మాత్రం కాదు.