టీ.వీ కొనాల‌నుకుంటున్నారా అయితే మీకో బ్యాడ్ న్యూస్

టీ.వీ కొనాల‌నుకుంటున్నారా అయితే మీకో బ్యాడ్ న్యూస్

0
33

పండుగ సీజన్ వ‌చ్చింది అంటే చాలు చాలా మంది టీవీలు ఫ్రిజ్ లు కొంటారు, అయితే కంపెనీలు భారీగా ఆఫ‌ర్లు ఇస్తాయి, అయితే ఈసారి సీన్ మారింది, క‌రోనా స‌మ‌యంలో చాలా మంది ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు కొనేందుకు దూరంగా ఉంటున్నారు.

అయితే క‌రోనా టైమ్ లో చైనా నుంచి రావాల్సిన ఉత్ప‌త్తులు చిన్న చిన్న ప‌రిక‌రాలు కూడా భార‌త్ కు రాలేదు, దీని వ‌‌ల్ల ప్యానెల్స్ చిన్న చిన్న ప‌రిక‌రాలు లేవు.. అందుకే కాస్త ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి, అంతేకాదు ఓపెన్ సెల్ ప్యానెల్స్‌పై 5 శాతం దిగుమతి సుంకం వచ్చే నెల నుంచి మళ్లీ అమలులోకి రానుంది.

అందుకే టీవీ ధ‌ర‌లు కాస్త పెరుగుతాయి అంటున్నారు అన‌లిస్టులు, అంతేకాదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆఫ‌ర్లు ఇచ్చేందుకు ఆస‌క్తి చూపించ‌డం లేదు అని తెలుస్తోంది, హైఎండ్ టీవీలు కూడా స్టాక్ లేక‌పోవ‌డంతో డిస్కౌంట్లు ఉండ‌వు అంటున్నారు వ్యాపారులు, మ‌ళ్లీ అన్నీ వ‌స్తువులు దిగుమ‌తి అయ్యేవ‌ర‌కూ ప‌రిస్దితి ఇలాగే ఉంటుంది అంటున్నారు.