బ్రేకింగ్ – ఏపీలో మందుబాబులకి మరో గుడ్ న్యూస్

బ్రేకింగ్ - ఏపీలో మందుబాబులకి మరో గుడ్ న్యూస్

0
35
AP News

కరోనా సమయంలో మార్చి నుంచి పూర్తిగా దేశ వ్యాప్తంగా బార్లు కూడా క్లోజ్ అయ్యాయి, అయితే తర్వాత నెమ్మదిగా మద్యం షాపులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇప్పుడు కేంద్రం కూడా మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇచ్చింది, అయితే తాజాగా ఏపీలో సర్కారు బార్ల లైసెన్సులు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నేటి నుంచి రాష్ట్రంలో బార్లు తెరుచుకోనున్నాయి. 840 బార్ల లైసెన్సులను వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అధికారులు.. అంతేకాదు ఈసారి బార్ల లైసెన్సులపై కొవిడ్ రుసుం విధించారు. 20 శాతం మేర విధించిన ఈ రుసుంను 2020-21 సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ వసూలు చేయనుంది.

అంతేకాదు ఇక బార్లలో మద్యానికి ఈ విక్రయాలపై 10 శాతం రిటైల్ పన్ను వసూలు చేయనున్నారు లైసెన్సు రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా 10 శాతం మేర పెంచారు. విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా 10 శాతం మేర ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.