నేడే సర్వీసులు విశాఖ – విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్

నేడే సర్వీసులు విశాఖ - విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్

0
37

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు.. మార్చి నెల చివరి నుంచి ఇక బస్సులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి.మార్చి నుంచి రోడ్డెక్కని ఆంధ్రప్రదేశ్ సిటీ బస్సులు, తాజాగానేటి నుంచి రోడ్డెక్కనున్నాయి.

ముఖ్యంగా సిటీ సర్వీసులు నడిచేది ఎక్కువగా విజయవాడ విశాఖ ఇక్కడ పరిశ్రమలు తెరిచారు ఉద్యోగాలకు వెళ్లేవారు వెళుతున్నారు, అయితే ఆటోలు క్యాబ్ లకి వందల రూపాయలు చెల్లిస్తున్నారు.. దీంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

తాజాగా సిటీ సర్వీసులు నడిస్తే చాలా వరకూ జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేస్తాము అంటున్నారు ప్రజలు, అయితే . విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో శనివారం నుంచి ఆర్టీసీ సిటీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతించింది.

బస్సుల్లో భౌతిక దూరం తప్పనిసరని తెలిపారు, ప్రయాణికులు దూరదూరంగా ఉండి ప్రయాణించే ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు , మాస్క్ కచ్చితంగా ధరించాలి..అయితే ముందు తక్కువ బస్సులు మాత్రమే నడుపుతారు.. తర్వాత డిమాండ్ బట్టీ కేసుల సంఖ్యని బట్టీ సర్వీసులు పెంచనున్నారు.