భేటీ వెనుక రహస్యం…

భేటీ వెనుక రహస్యం...

0

తెలుగుచిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ కమెడియన్ అలీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఇటీవలే సమావేశం అయిన సంగతి తెలిసిందే… ఇప్పుడు ఈ సమావేశంపై అనేక చర్చలు జరుగుతున్నాయి… 2019 ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీ లో చేరారు అలీ… ఆ ఎన్నికల్లో టికెట్ను ఆశించారు కానీ కొన్ని సమీకరణాలవల్ల ఆయనకు టికెట్ దక్కలేదు..

దీంతో ఆయన పార్టీ తరపున ప్రచారం చేసి వైసీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారు… ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలీ తనకు ఏదైనా నామినేటెడ్ పదవి దక్కుతుందని భావించారు… అయితే అటువంటి సంకేతాలు ఇప్పటివరకు రాలేదు… ఇదే విషయంపై అలీ జగన్ తో చర్చించేందుకు వెళ్లారని వార్తలు వస్తున్నాయి…

ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తనకు జరుగుతున్న అన్యాయంపై కూడా జగన్ కు వివరించారట… దీంతో జగన్ ఆయనకు త్వరలోనే నామినేటెడ్ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి… కాగా అలీ వైసీపీ తీర్థం తీసుకున్న తర్వాత రాను రాను సినిమా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి.. దీంతో ఆయన టీవీ షోలను చేస్తూ వస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here