మీకు రేషన్ కార్డ్ ఉందా ఇలా చేయండి ఈనెల 30 వరకూ గడువు

మీకు రేషన్ కార్డ్ ఉందా ఇలా చేయండి ఈనెల 30 వరకూ గడువు

0
32

ఈరోజుల్లో రేషన్ కార్డు చాలా మందికి ఉంది, అయితే రేషన్ కార్డు ఉన్న వారు సబ్సిడీతో రేషన్ పొందుతున్నారు, అంతేకాదు ఇలా రేషన్ పేదలకు అందిస్తోంది కేంద్రం, తెల్లరేషన్ కార్డు ఉన్న వారు అందరూ కూడా నెల నెల రేషన్ పొందుతున్నారు, కాని తాజాగా కేంద్రం వన్ నేషన్ వన్ రేషన్ పాలసీ తీసుకువచ్చింది.

దీని వల్ల మీరు ఏ స్టేట్ కు చెందిన వారు అయినా దేశంలో ఎక్కడ అయినా రేషన్ పొందవచ్చు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలోనే రేషన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానానికి గడువు పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి గడువు ఇచ్చింది. ఇక మరో వారం రోజుల్లో ఈ గడువు ముగుస్తుంది.

మీరు రేషన్ సెంటర్ లో కూడా ఇలా చేసుకోవచ్చు.. అక్కడ మీరు ఆధార్ జిరాక్స్ ఆ రేషన్ కార్డులో ఉన్న వారి ఆధార్ జిరాక్స్ లు ఇవ్వాలి…మీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అలాగే బ్యాంకు ఖాతా జిరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, లేదా ఆన్ లైన్ లో కూడా దీనిని పూర్తి చేస్తారు..వీటి ద్వారా మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డును లింక్ చేస్తారు. ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ కాకపోతే వన్ నేషన్ వన్ రేషన్ అనే స్కీమ్ కింద బెనిఫిట్ పొందడం కుదరదు అంటున్నారు అధికారులు.