ఓట‌మిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ధోనీ అదే కార‌ణం

ఓట‌మిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ధోనీ అదే కార‌ణం

0

ఫ‌స్ట్ మ్యాచ్ లోనే విజేత‌గా నిలిచింది చెన్నై సూప‌ర్ కింగ్స్…ముంబై ఇండియన్స్ పై విజ‌యంతో సెకండ్ మ్యాచ్ ఆడారు..కాని రాజస్థాన్ రాయల్స్ ను ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్, 16 పరుగుల తేడాతో పోరాడి ఓడిపోయింది.

ఇక ఈ మ్యాచ్ పై స్పందించిన జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, తమ ఓటమికి కారణాలను విశ్లేషించాడు. 217 పరుగులు అసాధ్యమైన లక్ష్యమేమీ కాదని.. అయితే ఈ 14 రోజుల క్వారంటైన్ తమ ప్ర‌భావం చూపించింది అన్నాడు ధోనీ.

తాను, గడచిన ఏడాదిగా ఆడకపోవడంతోనే లోయర్ ఆర్డర్ లో వస్తున్నానని చెప్పాడు. జట్టులో ఇద్దరు ఆటగాళ్లతో పాటు 13 మందికి కరోనా రావడం ప్రభావం చూపిందని చెప్పుకొచ్చాడు. అయితే గ‌త మ్యాచుల్లో చూపిన దూకుడు ధోనీ చూపించ‌లేక‌పోయాడు.. చివరి ఓవర్లో మాత్రమే మూడు సిక్స్ లు బాది, తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటాడు. అయితే ముందు ఓవ‌ర్ లో ధోనీ బ‌లంగా ఆడి ఉంటే మ్యాచ్ ట‌ర్న్ అయ్యేది అంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here