శానిటైజర్ మంచిదో కాదో గోదుమపిండితో ఇలా తెలుసుకోండి

శానిటైజర్ మంచిదో కాదో గోదుమపిండితో ఇలా తెలుసుకోండి

0

ఈ కరోనా సమయంలో మాస్కులు గ్లౌజులు అలాగే శానిటైజర్ల వాడకం బాగాపెరిగింది, అయితే ఈ 9 నెలల కాలంలో చాలా కంపెనీలు శానిటైజర్లు తయారు చేశాయి.. మార్కెట్లో అనేక శానిటైజర్లు వచ్చాయి, అయితే కొందరు నాశిరకం శానిటైజర్లు కూడా అమ్ముతున్నారు, మందులేక కొందరు ఇవి తాగి మత్తు వస్తోంది అని మరణించిన వారు ఉన్నారు.

శానిటైజర్ తాగకూడదు, ఇది చేతులకి రాసుకుంటే ఆ కరోనా వైరస్ ఉంటే చనిపోతుంది అని వైద్యులు చెబుతున్నారు, అయితే ఈ శానిటైజర్ నిప్పు ఉన్న చోట అస్సలు ఉంచకూడదు, అయితే మేలైన శానిటైజర్ అవునా కాదా అని తెలుసుకోవడం ఎలా అని ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు.

చాలా మందికి ఈ నాశిరకం శానిటైజర్లు వాడటం వల్ల, చేతులకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మీరు ముందు ఓ చెంచా గోధుమ పిండి తీసుకొని దానికి శానిటైజర్ కలపండి ..ఒకవేళ గోధుమపిండి అతుక్కుపోతే అది నాణ్యమైన శానిటైజర్ కాదు.. గోధుమపిండి పొడిగానే ఉంటే అది నాణ్యమైన శానిటైజర్ , మీరు వాడే శానిటైజర్ ఓసారి చెక్ చేస్తే మీకే తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here