వివాదాలకు కేరాఫ్ గా మారిన లేడీ లీడర్…

వివాదాలకు కేరాఫ్ గా మారిన లేడీ లీడర్...

0

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అందులో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రత్యేకం అని చెప్పుకోవాలి… తొలి నుంచి ఉండవల్లి శ్రీదేవి వివాదాలకు కేరాఫ్ గా మారింది..

2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమె పోటీ చేసి గెలిచింది.. ఇక అప్పటినుంచి ఆమె సెగ్మెంట్ లో చలరేగిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.. ప్రస్తుతం వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తుంది.. ఈ పదిహేను నెలల్లో ఉండవల్లి శ్రీదేవి ఎన్నో వివాదాలు ఎదుర్కుంటున్నారు…

తొలుత పార్టీ ఎంపీ నందిగామ సురేష్ తో పొసగలేదు… గతంలో ఇసుక తవ్వకాల వివాదం తలెత్తింది.. ఇక దీనిపై అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది… అలాగే క్రషర్ల విషయంలో కూడా ఆరోపణలు ఎదుర్కున్నారు… క్రషర్ల యజమానుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here