ఇక ఆదాయ ,కుల ధ్రువీకరణ పత్రాల విషయం లో డోకా లేదంటున్న కేసీఆర్

ఇక ఆదాయ ,కుల ధ్రువీకరణ పత్రాల విషయం లో డోకా లేదంటున్న కేసీఆర్

0
34

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా తెచ్చిన రెవిన్యూ చట్టం చాల కీలకమైన మార్పులు చేసారు . రెవిన్యూ కార్యాలయాల్లో జరిగే చాల ప్రక్రియలను గ్రామా పంచాయతీల్లో జరిగే విధంగా అయన చూస్తున్నారు .వాటిలో భాగంగానే ఆదాయ ,కుల ధ్రువీకరణ పత్రాల కోసం జనాలు ఇంతకు ముందు పడిన ఇబ్బందులు ఇప్పుడు పడాల్సిన అవసరం లేదని అయన అన్నారు .

ప్రజలు తమ సొంత గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో ఈ పాత్రలని పొందవచ్చని ,మాటిమాటికి ఆఫీసుల చుట్టూ తిరిగి రెన్యూవల్ చేయించుకునే పనిలేకుండా ప్రక్రియ మొత్తాన్నికంప్యూటరైజ్డ్ చేశామని ,ఇక పై భూమి కి సంబందించిన రిజిస్ట్రేషన్ లు కూడా ఆన్లైన్ లోనే జరగటం వాళ్ళ ఎలాంటి తప్పులు దొర్లవనీ అయన అన్నారు . అయితే రెవిన్యూ ఆఫీసుల్లో జరిగే అవినీతిని అరికట్టడానికి ,అధికారుల అక్రమార్జనకు చెక్ పెట్టడానికే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .