లగ్జరీ హౌస్ కడుతున్న కాజల్ ఎక్కడో తెలుసా

0

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వివాహం గురించి గత పది రోజులుగా వార్తలు వినిపించాయి, ఆమె తనకి తన కుటుంబానికి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటున్నారు..ముంబైకి చెందిన బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లూని ఆమె పెళ్లాడబోతోంది. ఇంటీరియర్ బిజినెస్ కు సంబంధించిన కంపెనీని గౌతమ్ నిర్వహిస్తున్నాడు.

ముందు వీరు మంచి స్నేహితులు తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు, పెళ్లికి పెద్దలు అంగీకరించారు, అక్టోబర్ 30న వీరి వివాహం ముంబైలో జరగనుంది. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగబోతోంది. ఇప్పటికే టాలీవుడ్ కోలీవుడ్ లో కాజల్ ఫుల్ బిజీ హీరోయిన్, ఆమె చేతిలో పలు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.

అయితే ఆమె వివాహం తర్వాత కూడా చిత్రాలు చేస్తారు అని వార్తలు వస్తున్నాయి, తాజాగా ఆమె తన భర్తతో కలిసి ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేశారట.. సొంత ఇంటి ఏర్పాట్లలో ఈ జంట ఉంది. తమ కొత్త ఇంటి పనులు జరుగుతున్నాయని కాజల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. ఇక ముంబైలో ఈ ఇళ్లు నిర్మిస్తున్నారు అని తెలుస్తోంది. ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని అభిమానులను సరదాగా అడిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here