బ్రేకింగ్ భారీగా తగ్గిన బంగారం ధర- పెరిగిన వెండి ధరలు

-

బంగారం ధర మార్కెట్లో భారీగా తగ్గుతోంది, గడిచిన రెండు రోజులుగా బంగారం ధర తగ్గుదల కనిపిస్తోంది.. పసిడి ధర పడిపోతే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. ఇక బంగారం ధర ఇలాడౌన్ అవ్వడంతో కొనుగోలు చేయాలి అనిభావించే వారికి ఊరట కలుగుతోంది.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గుదలతో రూ.51,720కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.320 దిగొచ్చింది. దీంతో ధర రూ.47,410కు చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.64,700కు చేరింది. అయితే వచ్చే రోజుల్లో పసిడి వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...