తన మిత్రుల కోసం సినిమా చేసిన చిరంజీవి – ఆ సినిమా సూపర్ హిట్ భారీ లాభాలు

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి పైకి వచ్చిన నటుడు, అగ్రహీరోగా ఆయన కొనసాగతున్నారు, ఆయన కెరియర్లో చాలా వరకూ హిట్ సినిమాలే చేశారు, రికార్డులు కూడా క్రియేట్ చేసిన అగ్రహీరో చిరంజీవి, తనతో పాటు తనవాళ్లూ కూడా ఎదగాలన్నది ఆయన నమ్మిన సూత్రం.

- Advertisement -

అందుకే ఆయనని చిత్ర సీమలో అందరూ అన్నయ్య అని పిలుచుకుంటారు, ఆయనకు సినిమా పరిశ్రమలో మంచి మిత్రులు అంటే సుధాకర్ హరిప్రసాద్..చిరంజీవి చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటున్న రోజుల్లో నటులు సుధాకర్, హరిప్రసాద్లతో మంచి స్నేహం ఏర్పడింది.

సినిమాలు కూడా కలిసి చేయడంతో వారితో ఎంతో సరదాగా ఉండేవారు, చిత్ర సీమలో సుధాకర్ మంచి కమెడియన్ గా ఎదిగారు
విలన్గా, హరిప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకున్నారు.. ఇలాంటి సమయంలో సుధాకర్, హరిప్రసాద్ నిర్మాతలుగా మారి చిరుని ఓ సినిమా చేయమని కోరారు.. వీరి కాంబోలో దేవాంతకుడు సినిమా 1984లో విడుదల అయింది. అంతగా ఆడలేదు.

ఇక వారికి నష్టాలు వచ్చాయి, అయితే తన స్నేహితులు నష్టపోకూడదు అని చిరు భావించారు, మరో సినిమా చేస్తాను అని చెప్పారు.. సూపర్ ఫిల్మ్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో 1988లో యముడికి మొగుడు చేశారు, ఇది సూపర్ హిట్ అయింది వారికి నష్టాలు పోయి లాభాలు వచ్చాయి, స్నేహితులు ఇద్దరూ ఆర్దికంగా నిలదొక్కుకున్నారు.అందుకే చిరు అంటే అందరికి అంత అభిమానం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...