బ్రేకింగ్ — నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ఇలా ఫ్రీగా పొందండి

0

ఓటీటీ ప్లాట్ ఫాం లే ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ కి రారాజులు, ఏ సినిమా అయినా షో అయినా ఏది కావాలి అన్నా మొబైల్ పీసీలు ల్యాబ్ ట్యాప్ టీవీ అన్నింటిలో ఓటీటీ పెట్టుకోవడం మనకు నచ్చింది చూడటం.. ఇదే ఇప్పుడు యూత్ బాగా ఫాలో అవుతున్నారు, సూపర్ కంటెంట్ తో అంతర్జాతీయ ఓటీటీలు అన్నీ దేశాలకు చేరువ అవుతున్నాయి, ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో కూడా సర్వీసులు అందిస్తున్నాయి.

ఇలాంటి వేళ తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక ఇండియాలో రెండు రోజుల పాటు ఫ్రీ యాక్సెస్ కల్పిస్తోంది. కొత్త యూజర్లు ఎవరైనా దీనిని ఉపయోగించుకోవచ్చు, మరి ఈ ఆఫర్ ఏమిటి అనేది చూద్దాం
ఈ యాప్ లో సబ్స్క్రిప్షన్ ఉన్న వారు మాత్రమే వీడియోలను చూసేందుకు యాక్సెస్ ఉంటుంది ఇప్పటి వరకూ.

అయితే మీకు సబ్స్క్రిప్షన్ లేకపోయినా మీరు డిసెంబర్ 5, 6 తేదీల్లో నెట్ ఫ్లిక్స్ను ఉచితంగా చూడవచ్చు. యూజర్లు తమ పేరు, ఈ మెయిల్ ఐడీ ఇచ్చి ఓ పాస్ వర్డ్ పొందాలి. ఆ తర్వాత ఇక 48 గంటల పాటు మీ ఇష్టం వచ్చిన వీడియోలను చూసుకోవచ్చు. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే ఈ ఆఫర్ అందరికి ఉంటుంది. మరి కొత్త యూజర్లు సబ్స్క్రిప్షన్ ఎంత వరకూ పెరుగుతుందో చూడాలి అంటున్నారు ఓటీటీ అనలిస్టులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here