నిర్మాతకి దర్శకుడికి షాక్ ఇచ్చిన టాప్ హీరో

0

ఓపక్క కరోనా మరో పక్క ఉపాధి కరువు అయింది.. అయితే చిత్ర సీమలో కొందరు మాత్రం కొత్త సినిమా కథలు వినడం లేదు. దీనికి కారణం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కధ విని ఒకే చెబితే కచ్చితంగా నిర్మాత టోకెన్ అమౌంట్ ఇస్తారు, ఇక కరోనా సమయంలో అతి తక్కువ రేటుకి సినిమా ఒప్పుకోవాలి.. సో చాలా మంది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ కొందరు హీరోలు కొత్త కధలకి ఒకే చెప్పడం లేదు.

అంతేకాదు రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోవడం లేదు అని తెలుస్తోంది, మార్చికి కరోనా వ్యాక్సిన్ వస్తే సాధారణ స్దితి వస్తుంది.. ఇక సినిమా థియేటర్లకు జనాలు వస్తారు.. సో అప్పటి నుంచి సినిమా పరిశ్రమకు మళ్లీ పాత రోజులు రావచ్చు అని చూస్తున్నారు, అందుకే చాలా మంది దర్శకులు కొత్త కధలు చెబుతున్నా హీరోలు మాత్రం ఎస్ చెప్పడం లేదట. దాదాపు నెలన్నర నుంచి ఇదే కనిపిస్తుంది కొన్ని చిత్ర సీమల్లో.

బాలీవుడ్ లో ఓ హీరో ఏకంగా 45 కోట్ల రెమ్యునరేషన్ ని కాదని అన్నాడట ఈ సమయంలో ఒప్పుకుంటే 45 కోట్లే వస్తుంది, అదే కరోనా పాండమిక్ తర్వాత అతని పాత రెమ్యునరేషన్ 85 కోట్ల వరకూ వస్తుంది అని ఇలా చేశారట, ఇది అన్నీ చోట్లా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు, కన్నడ స్టార్ హీరోలు కూడా నిర్మాతలకు ఇప్పుడు ఎస్ చెప్పడం లేదట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here