బుల్లితెరపై సందడి చేయనున్న సుమక్క – వంటలక్క కొత్త యాడ్

0

సుమక్కతో వంటలక్క బుల్లితెరపై ఇద్దరూ మంచి ఫేమ్ తో దూసుకుపోతున్నారు, సుమ పలు షోలు సినిమా ఆడియో ఫంక్షన్లతో బిజీగా ఉంటే ఇటు వంటలక్క ప్రేమి విశ్వనాధ్ కార్తీక దీపం సీరియల్ తో బిజీగా ఉన్నారు..
ఇద్దరూ కలసి ఒకే సారి స్క్రీన్ మీద కనిపిస్తే ఇక మహిళలకు పండగే. మరి అదే జరుగబోతోంది. మరిక్రేజీ ప్రాజెక్ట్ ఏమిటి అని అనుకుంటున్నారా.

వీరిద్దరి కాంబినేషన్లో ఓ యాడ్ రాబోతోంది. ఇప్పటి వరకూ ఓ యాడ్ సుమ చేస్తోంది అందులో ప్రేమీ విశ్వనాథ్ కూడా నటించనున్నారు… తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు యాడ్లో ఇప్పటి వరకు యాంకర్ సుమ మాత్రమే నటించారు, ఇక ఈ యాడ్ లో వంటలక్క కూడా నటించనుంది.

స్వయానా ప్రేమీ విశ్వనాథ్ అభిమానులతో ఈ విషయం పంచుకుంది. సుమతో కలసి యాడ్ షూట్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు, ఇక వీరిద్దరూ మలయాళీలు అనే విషయం తెలిసిందే, ఇక ఇద్దరూ తెలుగులో మంచి ఫేమ్ సంపాదించారు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇద్దరూ కలిసి కనిపించారు.. మళ్లీ ఇప్పుడు ఈ యాడ్ లో కనిపించనున్నారు. ఇక వంటలక్క ప్రేమీ విశ్వనాథ్ సీరియల్స తో పాటు యాడ్స్ సినిమాలలో నటించేందుకు రెడీ అవుతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here