పొట్ట పెంచుదాం కొత్త హోటల్ క్యూ కడుతున్న జనం

0

ఈరోజుల్లో వ్యాపారం అంటే కొత్తగా ఉండాలి అందరూ చేసే వ్యాపారం నువ్వు చేస్తే అందులో స్పెషల్ ఏముంది, ముఖ్యంగా సంథింగ్ స్పెషల్ గా క్రియేటీవ్ గా ఉంటేనే అవి సక్సెస్ అవుతున్నాయి..ఇక ఫుడ్ రెస్టారెంట్లలో టేస్ట్ బాగుండాలి పేరు బాగుండాలి అప్పుడు అవి బాగా సక్సెస్ అవుతాయి, మంచి పేరు పెడితే మౌత్ పబ్లిసిటీ కూడా పెరుగుతుంది.

అమ్మవంటలు, చట్నీలు కారాలు, టిఫిన్స్ తిందాంరా, టేబుల్ రెడీ, ఇలా అనేక పేర్లు ఇటీవల కొత్తగా వింటున్నాం అయితే సరికొత్తగా పేర్లు పెడుతూ అందరిని ఆకర్షిస్తున్నాయి రెస్టారెంట్లు… ఓ వ్యక్తి తన రెస్టారెంట్ కు పొట్ట పెంచుదాం అనే పేరు పెట్టేశారు. అందరూ పొట్ట తగ్గించుకుందాం అని నానా తిప్పలు పడుతుంటే.. ఈయన పొట్టపెంచుకుందాం అనే పేరు పెట్టారు, ఇప్పుడు ఈ పేరు తెగ వైరల్ అవుతోంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొత్తగా ఏర్పాటైన ఈ రెస్టారెంట్ పేరు పొట్ట పెంచుదాం.. ఈ పేరు తెగ వైరల్ అవుతోంది, చాలా మంది ఈ పేరు విని లోపల ఫుడ్ ఎలా ఉంటుందా అని వెళుతున్నారు, ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండానే ఫ్రీపబ్లి సిటీ వచ్చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here