బిగ్ బాస్ సీజన్ 5లో ఆ సింగర్ కు ఛాన్స్ ?

0
గత ఏడాది కరోనా వల్ల అసలు బిగ్ బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని అందరూ అనుకున్నారు.. కాని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని కొంచెం ఆలస్యంగా సీజన్ 4 స్టార్ట్ చేశారు.. అయితే 105 రోజులు అద్బుతమైన ఎంటర్ టైన్మెంట్ అందించారు, ఇక హౌస్ లోకి గత సీజన్ లో చాలా మంది సోషల్ మీడియా స్టార్లను తీసుకువచ్చారు.. వారి ఆటతో తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
అయితే ఇప్పుడు సీజన్ 5 కి ఏర్పాట్లు షురూ అయ్యాయి, దాదాపు వారిని మూడునెలల ముందు నుంచి అగ్రి మెంట్ చేసుకుంటారు కాబట్టి.. చాలా మందిని పరిశీలిస్తున్నారు.. కొందరు ఒకే చెబుతున్నారట, ఇక బిగ్ బాస్ లో ఏ సీజన్ తీసుకున్నా కచ్చితంగా సింగర్స్ ఉంటారు, వారి పాటలతో హౌస్ లోని సభ్యులతో పాటు ఇటు చూసే ప్రేక్షకులని కూడా గాత్రంతో అలరిస్తారు.
మరి ఈసారి కూడా సింగర్ ఉంటారు అని తెలుస్తోంది, అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఓ ప్రముఖ సింగర్ పేరు వినిపిస్తోంది.. గతంలో చూస్తే సింగర్ గీత మాధురి, రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు, ఈసారి సింగర్ హేమచంద్రను తీసుకునే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు టాక్ అయితే నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here