పోసాని కృష్ణ మురళి కుమారుడు ఎవరో తెలుసా – ఏ చిత్రంలో చేశారో తెలుసా

0
పోసాని కృష్ణ మురళి టాలీవుడ్ లో ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు.. మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పేస్తారు ఆయన.. నటనలో ఆయన అద్బుతం విలక్షణమైన నటుడు ఏ పాత్ర అయినా అద్బుతంగా చేయగలడు, అందుకే అందరూ టాప్ హీరోల సినిమాల్లో నటించారు ఆయన… ఇక దర్శకుడిగా రచయితగా నటుడిగా ఆయనకు ఎంతో పేరు ఉంది.
క్యారక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో బిజీ బీజీగా ఉన్నారు ఆయన.
ఇక చాలా మంది దర్శకులు ఈయన దగ్గర సినిమాలకు పని చేశారు… కొరటాల శివ అలాగే  బోయపాటి శ్రీను కూడా ఆయన దగ్గర శిష్యరికం చేశారు. మరి ఆయన కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఎవరైనా అడుగుపెడుతున్నారా అంటే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది…పోసాని కృష్ణ మురళి కొడుకు కూడా త్వరలోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నట్టు టాలీవుడ్ టాక్ నడుస్తోంది.
పోసాని కృష్ణ మురళి కుమారుడి పేరు ప్రజ్వల్, ఆయన చిత్ర సీమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలి అని చూస్తున్నారట.
ఇక మరో విషయం మహేష్ బాబు కొరటాల కాంబో చిత్రం భరత్ అనే నేను…ఈ సినిమాకి  పోసాని కొడుకు ప్రజ్వల అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసారని తెలుస్తోంది.. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో శిక్షణ తీసుకుంటున్నారట. మొత్తానికి త్వరలో ఆయన కూడా ఓ మంచి కధతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here