గంటలో పెళ్లనగా – వధువుని తీసుకువెళ్లిపోయిన ఆమె తాత – ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే

0

పెళ్లి జరిగే వరకూ అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనే భయం చాలా మందికి కలుగుతోంది.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాలా అని మూడు ముళ్లు పడే వరకూ ఇరు కుటుంబ సభ్యులు టెన్షన్ లో ఉంటారు. మరికొన్ని గంట్లలో వివాహం అనగా ఆ అమ్మాయి తాత వచ్చి ఆమెని తమ సొంత ఊరుకు తీసుకువెళ్లిపోయాడు.. అసలు ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం.

అనంతపురం జిల్లాలో ఓ యువతికి యువకుడికి వివాహం నిశ్చయించారు పెద్దలు.. ఇక అబ్బాయి తరపు వారు ఈ పెళ్లికి ఖర్చు చూసుకుంటున్నారు.. రేపు పెళ్లి అనగా దగ్గరల్లో ఉన్న ఓ దేవాలయం దగ్గర ఫోటో షూట్ పెట్టుకున్నారు, ఈ సమయంలో అటుగా వచ్చిన ఆమె తాత పెళ్లికి ముందు ఇలా దగ్గరగా ఉండి ఫోటోలు ఏమిటి అని అక్కడ నుంచి గొడవ పెట్టుకుని ఆమెని తీసుకువెళ్లిపోయాడు.

వరుడు తరపు వారికి అమ్మాయి తరపు వారికి దీనిపై గొడవ జరిగింది.. అయితే రాత్రికి రాత్రి ఆమెని తీసుకుని తన సొంత గ్రామం వెళ్లిపోయాడు తాత.. వెంటనే కుటుంబ సభ్యులు ఇద్దరూ కనిపించడం లేదు ఏమిటి అని వాకబు చేశారు .. ఫోన్ చేసి పెళ్లి లేదు ఏమీ లేదు మన ఊరు వచ్చేయండి అని తాత తెలిపాడు… దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వరుడు తరపువారు, అక్కడ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. చివరకు ఏమైందంటే ఆమె మైనర్ అని తేలింది దీంతో పెళ్లి క్యాన్సిల్ చేశారు ఇరు కుటుంబాలకి కౌన్సిలింగ్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here