అతనికి ఉన్న ఆ ఒక్క అలవాటు – కోటీశ్వరుడి నుంచి  బిచ్చగాడిని చేసింది

0
నిజమే మన అలవాట్లే మనల్ని అందలం ఎక్కిస్తాయి.. లేదా కింద పడేస్తాయి, జీవితంలో చెడు అలవాట్లు చాలా మంది జీవితాలని నాశనం చేశాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం, మనం జీవితంలో వేసే అడుగులు సరిగ్గా ఉంటే జీవితం బాగుంటుంది.. అంతేకాదు ఆ మంచి మార్గం పది మందికి ఉపయోగపడుతుంది.. చెడు అలవాట్లుతో ముందుకు వెళితే జీవితం
ఇబ్బందుల పాలు అవుతుంది.
తాజాగా ఓ ఘటన అందరిని షాక్ కి గురిచేసింది.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మున్సిపాలిటీ ఓ నిర్ణయం తీసుకుంది. నగరంలోని అనాథలను చేరదీయాలని నిర్ణయం తీసుకుంది. ఓ ఆలయం దగ్గర గత రెండేళ్లుగా బిచ్చం ఎత్తుకొని జీవిస్తున్న రమేష్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్లి మాట్లాడారు.. ఈ సమయంలో ఆ బిచ్చగాడిని ప్రశ్నిస్తే అతను అంతకు ముందు కోటీశ్వరుడు అని తేలింది.
మరి ఎందుకు ఇలా మారాడు అంటే అతనికి ఉన్న  అలవాటు వల్ల అతను ఇలా మారిపోయాడు..ఒకే ఒక్క అలవాటు అతడిని బిచ్చగాడిగా మార్చిందని అధికారులు చెబుతున్నారు. రమేష్ కు తాగుడు అలవాటు ఉంది.. ఇలా దానికి బానిస అయ్యాడు, చివరకు ఇంటి నుంచి ఇలా బయటకు వచ్చేశాడు… అయితే అతడి కుటుంబాన్ని పిలిపించి అతనిని అప్పగించారు. అతనికి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here