తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర రేటు ఎంతంటే

తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర రేటు ఎంతంటే

0
87
 ధర భారీగా పెరుగుతుంది తగ్గితే ధర సాధారణంగా తగ్గుతోంది అంటున్నారు జనం, ఇంతకీ దేనికి అనుకుంటున్నారా, పెట్రోల్ డిజీల్ వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఈ ధరలతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి, అయితే తాజాగా గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది, మరి ఎంత అనేది చూద్దాం.
గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధర పది రూపాయలు తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఇక ఈరోజు నుంచి ధర ఇంటి అవసరాలకు వాడేది
14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 809  కి అమ్ముతారు.
 అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనం అవుతుండడంతో మున్ముందు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు, గత నెలలో భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి.