మరో స్టోరీ రెడీ చేస్తున్న జాతిరత్నాలు దర్శకుడు – హీరో ఎవరంటే

మరో స్టోరీ రెడీ చేస్తున్న జాతిరత్నాలు దర్శకుడు - హీరో ఎవరంటే

0

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వీరు ముగ్గురు కలిసి నటించిన జాతిరత్నాలు చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే… మొత్తానికి ఈ సినిమా మంచి కలెక్షన్లు వసూలు చేసింది, ఫ్యామిలీ ఆడియన్స్ ని యూత్ ని ఆకట్టుకుంది ఈ చిత్రం.

దర్శకుడు కేవీ అనుదీప్ కు ఈ చిత్రంతో మంచి పేరు వచ్చింది. ఇక మరో సినిమా ఎప్పుడు చేస్తారు అని అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి కామెడీ డోస్ మరింత కావాలి తదుపరి చిత్రంలో అని అభిమానులు కోరుతున్నారు.

 

అయితే తాజాగా తనకు మంచి పేరు తీసుకువచ్చిన కామెడీ జోనర్లోనే తీస్తాడా.. లేక మరేదైనా స్టైల్లో తెరకెక్కిస్తాడా..

అనేది ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.. అయితే తాజాగా టాలీవుడ్ వార్తల ప్రకారం అనుదీప్ తన నెక్ట్స్ సినిమా కూడా ఇంతకు మించి కామెడీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

 

అనుదీప్తో వైజయంతి మూవీస్ సంస్థ మరో సినిమాని కూడా తీస్తామని హామీ ఇచ్చిందట. ఈ సినిమాని వైజయంతీ వారు తీస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి, ఇక యంగ్ హీరో పేరు కూడా పరిశీలిస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే క్రమంలో పడే ఇబ్బందులను చూపించనున్నారట. చూడాలి త్వరలోనే సినిమా పై ప్రకటన రానుందంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here