పవన్ – హరీశ్ శంకర్ సినిమా టైటిల్ అదేనా -టాలీవుడ్ టాక్

పవన్ - హరీశ్ శంకర్ సినిమా టైటిల్ అదేనా -టాలీవుడ్ టాక్

0

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ప్రస్తుతం రేపు వకీల్ సాబ్ చిత్రం రీలీజ్ కాబోతోంది, ఇక పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆనందంలో ఉన్నారు… ఇక హరిహర వీరమల్లు కూడా ఇప్పటికే షూటింగ్ లో ఉంది, సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా సెట్స్ పై ఉంది… ఇక క్రిష్ సినిమా పూర్తి అయ్యాక సాగర్ చంద్ర సినిమా కూడా పూర్తి అవుతుంది ..అయితే తనకు గబ్బర్ సింగ్ ద్వారా మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీశ్ తో ఓ సినిమా అనౌన్స్ చేశారు పవన కల్యాణ్.

 

ఆయనకి హరీశ్ శంకర్ ఒక కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ పూర్తి అయిన తర్వాత హరీష్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకి సంచారి టైటిల్ అయితే బాగుంటుందని హరీశ్ శంకర్ భావిస్తున్నాడట.

 

ఇక పవన్ కు నచ్చితే ఈ టైటిల్ పెట్టేస్తారు అని తెలుస్తోంది, అయితే టైటిల్ పై టాలీవుడ్ లో వార్తలు రావడంతో అభిమానులు కూడా టైటిల్ బాగుంది అంటున్నారు.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే మరో రెండు నెలల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవచ్చు అంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here