కోడలు ఉరివేసుకుని చనిపోతుంటే – వీడియో తీసిన అత్త మామలు దారుణం

కోడలు ఉరివేసుకుని చనిపోతుంటే - వీడియో తీసిన అత్త మామలు దారుణం

0

కొందరు కోడల్ని కన్న కూతురిలా చూసుకుంటారు.. కొందరు మాత్రం ఎంతో దారుణంగా హింసిస్తూ ఉంటారు.. అయితే ఇక్కడ జరిగిన దారుణం తెలిస్తే కన్నీరు వస్తుంది… ఆ కోడలు ఇంటిలో గొడవలతో ఉరి వేసుకోవడానికి యత్నించింది.. ఈ సమయంలో ఆమెని ఆపాల్సిన అత్త మామలు ఆమె ఉరి వేసుకుంటే దానిని సెల్ ఫోన్లో షూట్ చేశారు… అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి మాకు సంబంధం లేదు అని రుజువు చేసేందుకు ఇలా చేశారంటే, ఎంత దారుణంగా వారి ఆలోచన ఉందో అర్దం చేసుకోవచ్చు.

 

ఇప్పుడు దీనిని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు.. ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ డాటియానా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోమల్ అనే అమ్మాయితో ఆశిష్ అనే అబ్బాయికి 2019లో వివాహం జరిగింది.ఆమెకి ఐదు లక్షలు కట్నం కూడా ఇచ్చారు పేరెంట్స్. అంతేకాదు వరుడికి ఓ బైక్ కూడా ఇచ్చారు.

 

కాని ఇంకా కట్నం కావాలి అని ఆ వరుడు ఆమెని వేధించాడు, దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ పెద్దలు ఒప్పించి ఇంటికి పంపారు, అయినా అత్తమామలు ఇలా వేధించారు, దీంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చివరకు అత్త మామలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here