ఆటో డ్రైవర్కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సమంత – భారీ సాయం

ఆటో డ్రైవర్కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సమంత - భారీ సాయం

0

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎంతో మందికి సాయం చేస్తారు అనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో నిత్యం ఆమె యాక్టీవ్ గా ఉంటారు.. సమాజంలో ఏదైనా సంఘటన జరిగినా ఆమె స్పందిస్తారు.. ఆమెకి ఎవరైనా పీఆర్ టీమ్ ఏదైనా విషయం చెప్పినా ఎవరైనా సాయం కోరి వచ్చినా వారికి కాదు అనకుండా సాయం చేస్తారు సామ్…. తాజాగా ఆమె ఓ ఆటో డ్రైవర్ కి సాయం చేశారు ఓసారి ఆ స్టోరీ చూద్దాం.

 

 

సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ కవితకు హీరోయిన్ సమంత ఓ కారు అందచేశారు…బంజారాహిల్స్లోని మారుతి షోరూం నిర్వహకులు ఆమెకి ఫోన్ చేసి ఈకారు తీసుకోవడానికి రమ్మన్నారు.

రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్ డిజైర్ కారును అందజేశారు.

 

 

ఆరు నెలల క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో కవితకు ఆహ్వానం అందింది. ఆమె స్టోరీ యూట్యూబ్ లో కూడా పెట్టారు, దీనిని చూసిన సమంత ఆమెకి ఈ సాయం అందచేశారు. కవితకు చిన్నతనంలో పెళ్లి చేశారు భర్త తాగి వచ్చేవాడు, దీంతో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది, అలా పనులు చేసుకుంటూ ఏడుగురు చెల్లెల్లను పోషించింది.

తల్లి, దండ్రులు చనిపోవడంతో కుటుంబ పోషణ మరింత కష్టమైంది. దీంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాద్ కు వచ్చింది, ఇక్కడ నివాసం ఉంటూ మియాపూర్ బాచుపల్లిలో ఆటోనడుపుతోంది.. ఆమెకి కారు ఇచ్చి సాయం చేశారు సమంత.. ఆమె చేసిన సాయానికి అందరూ ప్రశంసిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here